ఎన్ సీ యూ ఐ వార్షిక మహాసభలో పాల్గొన్న మానాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో నేషనల్ కోపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సంఘానే ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక మహాజన సభలో తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంస్థను ఉద్దేశించి మాట్లాడారు. సహకార సంఘాలలో పెరిగిపోతున్న నిరాశ నిర్లక్ష్యం, అదేవిధంగా సహకార సంగానికి సభ్యులకు మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చే విధంగా ప్రజలు రైతులు సహకార సంఘం అంటే తమది అని అనుకోవాలి అంటే మరొక్కసారి ప్రజలకు రైతులకు...