Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:54 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

 

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో కాంగ్రెస్  పార్టీ సీనియర్ కార్యకర్త వర్ణం రాములు కుమారుడు వర్ణం నర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబాన్నిమాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని కోరారు.  అలాగే కొనసాముందర్ గ్రామంలో దాసరి కమల ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలియజేసి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు భాస్కర్, తీప్పిరెడ్డి శ్రీనివాస్, సుంకేటా రవి, బుచ్చి మల్లయ్య, పడిగేలా ప్రవీణ్ రెడ్డి, మురళి, సంజీవ్,  వివిధ గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.