Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:18 pm Posted by : ramakrishna

పిట్లంలో విచ్చలవిడిగా స్కీముల నిర్వహణ

 

. . . మామూళ్ల మత్తులో జరుగుతున్న అధికారులు

 

. . . ధనార్జన ధ్యేయంగా కొనసాగుతున్న వైనం

 

పిట్లం, బతుకమ్మ :

 

పిట్లం మండల కేంద్రంలో స్కీముల నిర్వహణ కొనసాగుతుంది. వీటిని నివారించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు సైతం మండలంలో అనేకంగా వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో గల బైక్ షోరూం లో నిర్వాహణలో బైక్ లను అమ్మడమే లక్ష్యంగా చేసుకున్న కొందరు నిర్వాహకులు స్కీముల పేరుతో మధ్యతరగతి వారిని ఆకర్షించి ఇదే స్కీములు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్కీముల నిర్వహణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించకూడదని ఉన్న నాయకులు అండదండలతో యదేచ్ఛగా పిట్లం మండల కేంద్రంలో నెలవారి డ్రాలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు

. . . చట్టం విరుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం

చట్ట విరుద్ధ కార్యక్రమాలు, అక్రమ స్క్రీములు నిర్వహిస్తే అటువంటి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పిట్లం ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అక్రమంగా నిర్వహిస్తున్న స్కీములను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

 

Management of schemes in the pits