మహిళను మర్డర్ చేసిన వ్యక్తికి జీవిత కారాగార శిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ మహిళను హత్య చేసిన షేక్ మహబూబ్ కు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ సోమవారం తీర్పు వెలువరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పిపి వెల్లడించిన తీర్పులోని వివరాలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడి పల్లి, మహాలక్ష్మి కాలోని నివాసుడైన షేక్ మహబూబ్ కు కల్లు తాగే అలవాటు ఉంది. కల్లుబట్టిలో మిర్యాల పోషవ్వ కూడా కల్లు తాగడానికి వచ్చేది. అక్కడ ఇద్దరికి పరిచయం అయింది. పోషవ్వకు ముగ్గురు సంతానం....