Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 8:33 pm Posted by : ramakrishna

హాస్పిటల్ లో దొంగతనం చేసిన ఒకరికి ఐదేళ్ల కఠిన జైలుశిక్ష

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

 

నైస్ పిల్లల హాస్పిటల్ గ్రౌండ్ ప్లోర్ లో రాగి పైపులు దొంగతనం చేసిన ఆర్గుల ఆనంద్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎమ్. రజని తెలిపారు.ఆమె తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి లో గల నైస్ పిల్లల ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన పిల్లలకు అవసరమైన పిల్లలకు కాపర్ ప్రిన్స్ ద్వారా ఆక్సీజన్ సరఫరా అవుతుంది. దానిని ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లో ఏర్పాటు చేశారు. ఆక్సీజన్ అయిపోయినప్పుడు,లేదా ఎవరైనా విప్పినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. 25,జనవరి 2026 న సాయంత్రం ఆ శబ్దం రావడంతో ఆసుపత్రి టెక్నీషియన్ సురే సాయి కిరణ్ వెంటనే గ్రౌండ్ ప్లోర్ కు వెళ్లి చూడగా ఒక వ్యక్తి హడావిడిగా వెళ్లడం కనిపించింది. కాపర్ పైప్స్ దొంగతనంకు గురి కాబడినదని గమనించారు. ఆసుపత్రి యాజమాన్యంకు విషయం తెలియజేసి నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. పిర్యాదు అనంతరం పూర్తి నేర విచారణ జరిపి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి దుబ్బ ప్రాంతానికి చెందిన ఆర్గుల్ ఆనంద్ గా గుర్తించి అతని నేరం ఒప్పుకోలు పంచానామ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతో నేర న్యాయ విచారణలో భాగంగా చార్జ్ షీట్ లో పేర్కొన్న సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్న కోర్టు, ధ్రువీకరించుకున్న పత్రాలను మార్క్ చేసింది. ముద్దాయి ఆనంద్ పై నేర నిరూపణ నిర్దారణ అయినట్లు జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పులో పేర్కొన్నారు. దొంగతనం నేరానికిగాను ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయలు జరిమానా విధించారని అదనపు పిపి రజని తెలిపారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారని ఆమె వివరించారు.

ముద్దాయిపై మర్డర్ కేసు..

ఆర్గుల ఆనంద్ పై ఒక మర్డర్ కేసు ఉంది. అతను దొంగతనం కేసుకు ముందు మర్డర్ కేసులో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉంది బెయిల్ పై విడుదల అయ్యాడు అయిన అతని నేర మనస్తత్వం మారలేదు. కోర్టు అతనిని దోషిగా తేల్చడంతో జైలుపాలు అయ్యాడు.