Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 5:59 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఒకరికి 7 రోజులు జైలు శిక్ష

.. ఇద్దరికీ జరిమానా

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

రెండు రోజుల క్రితం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వెంగలపాడు గ్రామానికి చెందిన లావుడియా పంతులు అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా 7 రోజులు జైలు శిక్ష విధించారని స్థానిక ఎస్సై జి సందీప్ తెలిపారు. మరో ఇద్దరికి 10,000 చొప్పున జరిమానా విధించారని తెలిపారు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం వల్ల వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జైలు శిక్షతోపాటు భారీ జరిమానాలు పెద్ద మొత్తంలో విధించడం జరుగుతుందని దీనిని వాహనదారులు గమనించాలని ఎస్సై జి సందీప్ తెలిపారు.