Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:53 pm Posted by : ramakrishna

బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు

 

. . . 108 సిబ్బంది సకాలంలో స్పందన

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని నగర్ శివారు రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. భీర్కూర్ మండలం చించొల్లి గ్రామానికి చెందిన బాబు తన కుమారుడి స్కూల్ అడ్మిషన్ పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి గాంధారి వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో నగర్ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో అతని ఎడమ కాలు విరగడంతో పాటు శరీరానికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈఎంటి రమేష్ గాయపడిన కాలుకు స్ప్లింట్ కట్టి, నొప్పి నివారణ కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జిజిహెచ్) కి తరలించారు. సకాలంలో స్పందించి సేవలందించిన 108 ఈఎంటీ రమేష్, పైలట్ సంజీవ్ గౌడ్‌లకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.