కామారెడ్డి, బతుకమ్మ : దొంగతనం కేసులో నిందింతునికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డి పేట్ మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్దగారి పర్వయ్య తన వ్యవసాయ భూమి అమ్మి అందిన మొత్తంలో నుంచి రూ.1,40,000 తన ఇంట్లోని బీరువాలో ఉంచాడు. తన అత్తగారి అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి 2020 సెప్టెంబర్ 22న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. తిరిగి 2020 సెప్టెంబర్ 24న వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి, బీరువా తెరిచి అందులో ఉన్న డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దీంతో 2020 సెప్టెంబర్ 25న నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా కాలనీవాసులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. చుట్టు పక్కల సీసీ కెమెరాలను పరిశీలించగా ఫిర్యాదుదారుని ఇంటి పక్కన నివసించే పాత నేరస్తుడు అయిన పట్నం సాయిలు పై అనుమానం వచ్చి విచారించగా డబ్బు తానే దొంగిలిచినట్లు ఒప్పకున్నాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరు పరచగా ఎల్లారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.సుష్మ నిందితునికి ఆరునెలల జైలు శిక్ష విధించారు.