Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 3:51 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో పడి వ్యక్తి గల్లంతు

నిజాంసాగర్, బతుకమ్మ :  నిజాంసాగర్ జలాశయం ప్రధాన కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది స్థానికులు, ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రే విఠల్ (40) మిషన్ భగీరథ లో విధులు నిర్వహిస్తుంటారు. మహమ్మద్ నగర్ సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో చేప కనపడటంతో పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి జలవనరులశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదలను నిలిపివేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.