ఎట్టకేలకు చిక్కిన ( పెద్దపులి) మ్యాన్ ఈటర్
వెబ్ డెస్క్, బతుకమ్మ: మ్యాన్ ఈటర్ గా మారిన పెద్ద పులిని ఆటవి శాఖాధికారులు ఎట్టకేలకు బందించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మ్యాన్ ఈటర్ ను ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి షూటర్ ద్వార మత్తు ఇచ్చి పట్టుకున్నారు. తడోబా అభయారణ్యం వారం క్రితం పెద్దపులి సంజయ్ అనే యువకుడు పొలం పనుల్లో ఉండగా దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బఫర్ జోన్ లో ఉన్న చోర్ గావ్...