వెబ్ డెస్క్, బతుకమ్మ:
మ్యాన్ ఈటర్ గా మారిన పెద్ద పులిని ఆటవి శాఖాధికారులు ఎట్టకేలకు బందించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మ్యాన్ ఈటర్ ను ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి షూటర్ ద్వార మత్తు ఇచ్చి పట్టుకున్నారు. తడోబా అభయారణ్యం వారం క్రితం పెద్దపులి సంజయ్ అనే యువకుడు పొలం పనుల్లో ఉండగా దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బఫర్ జోన్ లో ఉన్న చోర్ గావ్ లో జరిగిన ఘటన నేపథ్యంలో పెద్దపులి ని పట్టుకోవాలని ఆటవి శివారు ప్రాంతాల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దానితో ఆటవి శాఖ మ్యాన్ ఈటర్ ను పట్టుకునేందుకు వారం రోజులుగా పులి సంచారం ఉన్న గ్రామాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గాలించారు. ఎట్టకేలకు దానిని బంధించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన పెద్ధపులిని చంద్రాపూర్ జిల్లాలో పులుల సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు