చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాటూరి మల్లేష్ (33) చేపలు పట్టేందుకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లేష్ తన మిత్రుడు సాయితో కలిసి శనివారం ఉదయం రుద్రారం గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా చేపలు పడుతుండగా, మరో గట్టుకు వెళ్లేందుకు వలను తన వెంట పట్టుకుని నీటిలో ఈదుకుంటూ వెళ్తుండగా, ఆ వల అతని...