Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 8:52 pm Posted by : ramakrishna

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాటూరి మల్లేష్ (33) చేపలు పట్టేందుకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లేష్ తన మిత్రుడు సాయితో కలిసి శనివారం ఉదయం రుద్రారం గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా చేపలు పడుతుండగా, మరో గట్టుకు వెళ్లేందుకు వలను తన వెంట పట్టుకుని నీటిలో ఈదుకుంటూ వెళ్తుండగా, ఆ వల అతని కాళ్లకు చుట్టుకుంది. దీంతో ఈత కొట్టలేక నీటిలో మునిగి ఊపిరాడక మల్లేష్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.