Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:31 pm Posted by : ramakrishna

వడదెబ్బతో వ్యక్తి మృతి..

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఎం) గ్రామానికి చెందిన ధారావత్ రవి (40) గత ఐదు రోజుల నుంచి ట్రాక్టర్ నడుపుతూ వడదెబ్బకు గురై చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయ పనులలో భాగంగా గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా ట్రాక్టర్ నడుపుతూ వడదెబ్బ బారిన పడడం జరిగిందని స్థానికులు తెలిపారు. వడదెబ్బకు గురై చనిపోయిన మృతుడు రవి నిరుపేద కుటుంబానికి చెందిన వాడని ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.