కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి            

  ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్‌కు చెందిన పన్నీరు శ్రీనివాస్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ  విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో బోర్ మోటార్ మరమ్మతు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ...