Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:06 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

 

మెండోరా, బతుకమ్మ :

 

ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెండోరా మండలంలోని కోడిచర్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. కోడిచర్ల గ్రామానికి చెందిన మెట్టు కైలాస్ (51) బుధవారం తన ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి దూలలపై ఉన్న ఇనుప రేకుకు తెగిపోయిన విద్యుత్ తీగ తగిలి ఉండటాన్ని గమనించకుండా కైలాస్ ఆ ఇనుప రేకును తాకాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కైలాస్‌ను నిర్మల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.