Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:45 am Posted by : ramakrishna

ఎల్లారెడ్డి  శివారులో రోడ్డు ప్రమాదం వ్యక్తి దుర్మరణం

 

. . . చెట్టును కారు ఢీకొట్టడంతో ప్రమాధం

ఎల్లారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లో కొత్త హనుమాన్ మూల మలుపు  (కళ్యాణి ప్రాజెక్టు) సమీపంలో  గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్ అతివేగంతో చెట్టును డి కొట్టడంతో వ్యక్తి అందులో దుర్మరణం చెందారు.  కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన దండ్ల నాగరాజు హైదరాబాద్ నుంచి తన సొంతూరు వెళ్తున్న క్రమంలో  టిఎస్ 13 యు బి 4325 నెంబర్ గల కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ధండ్ల నాగరాజు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Man dies in road accident in Yella Reddy suburbs