పంట పొలంలో జారిపడి వ్యక్తి మృతి

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలోని పంట పొలాల్లో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దేశాయిపేట్ నారాయణ (45) పాత బాన్సువాడలోని గురు సిద్ధేశ్వర్‌కు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి భోజనం అనంతరం సుమారు 10 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన నారాయణ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని...