చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పాటి సురేందర్ (42) ఆదివారం ఇంట్లో చికెన్‌తో అన్నం తింటుండగా.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని కుటుంబం విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.