Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 1:22 pm Posted by : ramakrishna

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి  మృతి

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ  : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పాటి సురేందర్ (42) ఆదివారం ఇంట్లో చికెన్‌తో అన్నం తింటుండగా.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని కుటుంబం విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.