విద్యుత్ స్తంభం విరిగిపడి వ్యక్తి మృతి
హైదరాబాద్, బతుకమ్మ : విద్యుత్ స్తంభం మీద పడి సా ఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని నాచారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కార్తికేయ నగర్ కు చెందిన సాత్విక్ మంగళవారం ఉదయం రోడ్డుపై వెళ్తుండగా డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడి అతడిపై పడింది. దీంతో సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.