ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

బోధన్, బతుకమ్మ :  బోధన్ మండలం కల్దుర్కి శివారులో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ ఢీకొనడంతో రాములు(60) అనే వ్యక్తి  అక్కడికక్కడే  మృతి చెందారు. శుక్రవారం ఉదయం కల్దుర్కి శివారులోని  మంజీర నది నుంచి ఇసుక తీసుకు వస్తున్న ట్రాక్టర్ బోధన్ నుంచి ద్విచక్ర వాహనంపై అటు వైపుగా వెళ్తున్న రాములు ను  ఢీకొంది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.