Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 4:59 pm Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్‌ నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.

 

Man dies after being hit by RTC bus

 

ఈ ప్రమాదంలో అరుణ్ (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

 

Man dies after being hit by RTC bus