Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:01 pm Posted by : ramakrishna

ఐచర్ లారీ కిందపడి వ్యక్తి దుర్మరణం

 

. . . బాన్సువాడ తడ్కోల్ చౌరస్తాలో ప్రమాదం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని తడ్కోల్ చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉండటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  వివరాల్లోకి వెళ్తే స్థానికులు తెలిపిన ప్రకారం బిచ్కుంద మండలం గుప్పన్ పల్లి గ్రామానికి చెందిన కుర్మ హన్మంత్లు (55) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, తడ్కోల్ చౌరస్తా వద్ద లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఐచర్ చక్రాల కింద పడిపోవడంతో హన్మంత్లు శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వృత్తిరీత్యా రైతు అని సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.