Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:07 pm Posted by : ramakrishna

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

 

మెండోరా, బతుకమ్మ :

 

మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన ఏరేటి నర్సారెడ్డి (35) మద్యానికి బానిసై మృతి చెందినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోగా, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నర్సారెడ్డి అతిగా మద్యం సేవించి మద్యానికి బానిస అయ్యాడని, అతను ఫిట్స్ తో బాధపడేవాడని తెలిపారు. అతిగా మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తెవని, మతిస్థిమితం వల్ల ఇంట్లో నుండి వెళ్లిపోయి, అనారోగ్యం తో చనిపోయాడని, మృతుడి శవాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని తెలియజేశారు.

 

Man dies after becoming addicted to alcohol