జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలం లొంగన్ గ్రామం పెద్ద ఎడ్గి పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు చేపల వలకు చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వ్యక్తి డగోరే మారుతి గా గుర్తించారు. చేపల వల కారణంగానే తన భర్త మృతి చెందినట్లు భార్య ఆరోపించిందని తెలిపారు. తమకి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.