Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 12:03 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి రైలు, ప్లాట్ ఫారం మధ్య పడిపోగా రైలు కదలడంతో  సదరు వ్యక్తి మృతి చెందాడు.  నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ కిరణ్ కుమార్ బుధవారం తెలిపిన వివరాలు..   ఓ గుర్తు తెలియని వ్యక్తి(40-45)   రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ ఫ్లాట్ ఫారం  మధ్య పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడిని గుర్తించుటకు ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతుని కుడి చేయికి మధ్య వేలు తెగి ఉందన్నారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, అప్పర్ ధరించి ఉన్నాడని,  వివరాలు తెలిసినచో రైల్వే హెడ్ కానిస్టేబుల్ హన్మాండ్లు సెల్ నంబర్ 8712568440కి సమాచారం ఇవ్వాలని కోరారు.