Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 3:25 pm Posted by : ramakrishna

కత్తితో బెదిరించిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వైన్ షాపునకు వెళ్లి కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. గతనెల 31వ తేదీన బోధన్ రోడ్డులో ఉన్న దుర్గా వైన్స్ కు షేక్ అల్తాఫ్ అనే వ్యక్తి వెళ్లి మద్యం విక్రయిస్తున్న సతీశ్ రెడ్డి, నాగరాజును బెదిరించాడు.

డబ్బులు ఇస్తారా? లేదా అంటూ వైన్ షాపు నిర్వాహకులతోపాటు అక్కడికి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని కూడా అల్తాఫ్ కత్తితో బెదిరించాడు. పసునూరి విశ్వక్ కాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అల్తాఫ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ హెచ్ వో తెలిపారు.

అల్తాఫ్ ఫై గతంలో ముద్కెడ్ పోలీస్ స్టేషన్ లో హత్యానేరం కేసు నమోదైందని, జైలుకు వెళ్లి వచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు లేదని ఎస్ హెచ్ వో తెలిపారు.