నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 2వ టౌన్ పరిధిలో పాతకక్షలతో యువకుడిపై పంచ్ తో దాడిచేసి హత్యాయత్నం చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ తెలిపారు. ఈ నెల రెండవ వారంలో స్థానిక స్టేషన్ పరిధిలోని కాలనీలో షేక్ రెహన్ అనే యువకుడిపై సోహైల్ ఖాన్ పంచ్ తో ముక్కుపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిని రెహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా సోహైల్ పరారీలో ఉండగా శనివారం పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.