వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : వృద్ధురాలుని హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలోని నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెందిన గుగులోత్ రాధిబాయి అనే వృద్ధురాలు దీపావళి రోజు హత్యకు గురైందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి ఇంటి ఎదురుగా ఉంటున్న మోగావత్ సవాయి సింగ్ అనే వ్యక్తి హత్య కేసినట్లు గుర్తించారు....