Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 12:09 pm Posted by : ramakrishna

పోలీస్ వెబ్ సైట్లలోకి మాల్ వేర్..?

హైదరాబాద్, బతుకమ్మ : సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్ సైట్లు వారం రోజులుగా పనిచేయకపోవడంతో వీటిలోకి మాల్ వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెబ్ సైట్ ను క్లిక్ చేస్తే గేమింగ్ అప్లికేషన్ కు రీ డైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్న ఎన్ఐసీకి సమాచారం అందించారు. సమస్యను పరిష్కరించేందుకు, వెబ్ సైట్ల పునరుద్దరణకు రెండు కమిషనరేట్లలోని ఐటీ బృందాలు యత్నిస్తున్నాయి. వాటి సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తున్నారు. మళ్లీ హ్యాకింగ్ కు గురి కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ను ఐటీ బృందం సమీక్షిస్తుంది.