ముప్కాల్, బతుకమ్మ: జీవశాస్త్రం అంటే ఆయనకు ప్రాణం సైన్స్ ఫెయిర్ లో జాతీయస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోను రాణించి బహుమతి అందుకున్న వ్యక్తి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుద్ధపల్లి మల్లేష్. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపికైన మల్లేష్ ను కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ అనికిత్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మిఠాయిలు పంచి బాణసంచా కలసి సంబరాలు చేసుకున్నారు.