Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 5:54 pm Posted by : ramakrishna

మల్క కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన టీచర్ ఎమ్మెల్సీ కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  భారతీయ జనతా పార్టీ, తపాస్ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావిత ఓటర్లను గుర్తించి వారితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకుని అభ్యర్థి గురించి అవగాహన కల్పించాలన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతున్నాయని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ఢిల్లీలో మొదలైన విజయం, గల్లీలో కాషాయ జెండా ఎగురావేసే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.  ప్రస్తుత ఎన్నికలు,కొమురయ్య కు చెందినవి కావని, ఈ ఎన్నికలు ప్రతి బీజేపీ కార్యకర్త భవిష్యత్‌కు పునాది వేసే ఎన్నికలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి బలమైన స్థానం ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశంలో డా.కొండ అశన్న, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

 

Malka Komuraiah should win with a huge majority