Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 6:42 pm Posted by : ramakrishna

రైస్ మిల్లులో సరిగా పనిచేయని ప్యాడి క్లియర్ మిషన్లు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో గౌరీ శంకర్ రైస్ ఇండస్ట్రీస్ లో ప్యాడి క్లియర్ మిషన్లు పనిచేయడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే రైతులకు అడుగడుగునా అవంతరాలు ఎదురవుతున్నాయి. రైతుల దగ్గర 14 శాతం తేమ వస్తుంటే రైస్ మిల్లులో 17 శాతం వస్తుందని మిల్లు యజమానులు ధాన్యాన్ని తీసుకోమని చెబుతున్నారు.

Malfunctioning paddy clearing machines in rice mill

దీంతో హైరా నాకు గురైన రైతులు, మరో మిషన్ ద్వారా తేమ శాతం గుర్తించాలని కోరగా, మెదక్ జిల్లా రామాయంపేట నుంచి తీసుకొచ్చిన మిషన్ తో చెక్ చేస్తే 14 శాతం రావడంతో మిల్లు యజమానులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. వెంటనే అధికారులు స్పందించి ధాన్యం రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Malfunctioning paddy clearing machines in rice mill