మాకొద్దు ఫార్మా కంపెనీ

... ఒకవైపు భిక్కనూర్ బంద్    ...మరో వైపు అభిప్రాయసేకరణ భిక్కనూర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో భిక్కనూర్ మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రకటించడానికి వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం బిక్కనూర్ మండల కేంద్రంలో ఫార్మ కంపెనీ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే అధికారులు, ఫార్మా కంపెనీ యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న...