Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 12:51 pm Posted by : ramakrishna

మాకొద్దు ఫార్మా కంపెనీ

… ఒకవైపు భిక్కనూర్ బంద్ 

 

…మరో వైపు అభిప్రాయసేకరణ

భిక్కనూర్, బతుకమ్మ :

 కామారెడ్డి జిల్లాలో భిక్కనూర్ మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రకటించడానికి వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Makoddu Pharma Company

బుధవారం బిక్కనూర్ మండల కేంద్రంలో ఫార్మ కంపెనీ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే అధికారులు, ఫార్మా కంపెనీ యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు.. మరోవైపు ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా బిక్కనూర్ మండల కేంద్రంలో బంద్ కొనసాగుతుంది.

Makoddu Pharma Company

పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించడం కోస మెరుపు. ప్రజలు రైతులు యువత ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తుండగా ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.