నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వికలాంగులు,చేయూత పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలపారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నందిపేట్ మండలం కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడతూ వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సమావేశాన్ని ఎమ్మార్పీస్ జిల్లా ఇంచార్జి కూడలా స్వామి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు,సరికేల పోశెట్టి మాదిగ జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కలిగిట్ సంతోష్ మాదిగ ఆధ్వర్యం లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేయూత పెన్షన్ 2000 నుంచి 4000 లకు,వికలాంగులకు 4000 నుంచి 6000 లకు, కండరాల బలహీనులకు15000 పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో చేయూత, వికలాంగుల పెన్షన్లు పెంచారని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 19 నెలలు అవుతున్న వికలాంగులు, చేయూత పెన్షన్ ,ఇతర పెన్షన్ దారులకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా వికలాంగులు చేయూత,ఇతర పెన్షన్ దారులు వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్మల్ గంగాధర్ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆర్మూర్ శంకర్,, గంగ మల్లయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.