Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 6:41 pm Posted by : ramakrishna

టీయూసీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి

  • టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీయూసీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ జూన్ 1న జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్.ఆర్ భవన్ లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు ముఖ్య వక్తులుగా టియుసిఐ  రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతారన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, భవన నిర్మాణ, మిషన్ భగీరథ, హమాలీ, మోటారు రంగ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం, వారి ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం యూనియన్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేశామన్నారు. ఈ నేపథ్యంలో గత పోరాటాలను సమీక్షించుకుని, భవిష్యత్తును కార్యాచరణను రూపొందించుకోవడం కోసం, కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం జూన్ 1వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం .వెంకన్న,  డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.