Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 3:58 pm Posted by : ramakrishna

నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలన స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమాన్నినగరంలోని ఎన్జీఆర్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుoలోకి వచ్చినాక విద్య రంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి ఏడు శాతం మాత్రమే గత  సంవత్సరం కేటాయించడం కారణంగా విద్యారంగం నిర్వీర్యమైందని అన్నారు. ఈ సంవత్సరమైనా ఈ నెలలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసినట్లు 15శాతం నిధులుకు అదనంగా మరో ఐదు శాతం కలుపుకొని 20శాతం నిధులను విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో  కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.