మోపాల్, బతుకమ్మ : 5న ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో నిర్వహించే సన్మాహక సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మోపాల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, అనుబంధం సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు19 నెలలు అవుతున్న పెంషన్లు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆగస్టు13న నిర్వహించతలపెట్టిన వికలాంగులు, చేయుత పెన్షన్ దారుల మహా గర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సన్నాహక సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వికలాంగులకు రూ.6వేలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు చేయుత పెన్షన్ దారులకు రూ.4వేలు తక్షణమే అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రభుత్వంమీద ఎటువంటి పొరటలకైన సిద్ధమే అని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు బిరప్ప, ఉపాధ్యాయులు సలీమ్, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు పెద్దోళ్ల యమున, ఎంఆర్పీఎస్ మండల నాయకులు పిడుగు మహేష్, గుండారం అశోక్, ఎర్రోళ్ల గోపి, ధమ్మడి విక్కీ తదితరులు పాల్గొన్నారు.