29న పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దీర్ఘకాలంగా పెండింగ్ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు. గురువారం నిజామాబాదులోని పెన్షనర్స్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు హాజరుకావాలని కమిటీ తీర్మానం చేసింది. ప్రధానంగా గత సంవత్సరం పైగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి...