Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2024, 6:55 pm Posted by : ramakrishna

పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయండి

  • పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 20 న జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్లో జరిగే అర్థ శతాబ్ద సభను విజయవంతం చేయాలని పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో బుధవారం  పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం ఏర్పడి 50 ఏళ్లు కావస్తుందని, ఎన్నో ఆటుపోట్లు ఎన్నెన్నో అనుభవాలు అన్నింటిని నిలదొక్కుకొని నేటికి సజీవంగా ఉందని, ఈ 50 ఏళ్ల కాలంలో ఎన్నో సమస్యల పోరాటాలు నిర్మించిందని, ఎన్నో విజయాలు సాధించిందన్నారు. వారి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆశయ సాధన కోసం పోరాటం చేయాలని, 1974 నుండి 2024 వరకు పనిచేసిన పూర్వ పి.డి.ఎస్.యూ నాయకులు ప్రస్తుతం పని చేస్తున్న పి.డి.ఎస్.యూ కార్యకర్తలు విద్యార్థులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు ప్రిన్స్,మనోజ్,రాహులు ,రాజు తదితరులు పాల్గొన్నారు.