పీడీఎస్యూ జిల్లా మహాసభను విజయవంతం చేయండి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఈనెల 25న నిజామాబాద్ జిల్లా పీడీఎస్ యూ 23వ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ బాలుర వసతి గృహం ముందు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, యూనివర్సిటీ నాయకులు నితిన్ మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వంతో, పిడిఎస్యు నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టిన గడ్డమీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ యూ 23 వ మహాసభ...