Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 4:52 pm Posted by : ramakrishna

నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఏప్రిల్ 28 న సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సంస్మరణ సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు కోరారు. ఈ విషయమై సోమవారం జిల్లాలోని సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూర్జహాన్ సంస్మరణ సభను మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. నూర్జహాన్ అనేక మంది పేద ప్రజల సమస్యల పైన ఎన్నో ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారన్నారు. హైదరాబాద్ లో జరిగిన నిరవధిక నిరాహార దీక్షలో వారం రోజులకు పైగా పాల్గొని తన పోరాట పట్టిమను చూపెట్టారని, అనేక కార్మిక వర్గ పోరాటాల్లో అగ్రభాగాన ఉండి ఉద్యమాలు నిర్వహించారని, అందువల్ల ఆమె ప్రజా ఉద్యమాల్లో ఉంటూనే ప్రాణాలు కోల్పోయినందున, సిపిఎం పార్టీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం కోసం సంస్మరణ సభను నిర్వహించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.