Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 5:51 pm Posted by : ramakrishna

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :     

 

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను కోటగల్లి, ఎన్ ఆర్ భవన్ వద్ద సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలని కనీస వేతనాలు 26,000గా నిర్ణయించి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిచ్ పల్లిలో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాలు 26వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్, జిల్లా కోశాధికారి సాయి రెడ్డి, జిల్లా నాయకులు లింగం, రాజు, చరణ్, రవి, సాయిబాబా, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.