- టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : కార్మికుల చట్టాలను కాలరాస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న టీ యు సీ ఐ నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చెయ్యాలని టీ యు సీ ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే. రాజేశ్వర్ పిలుపునిచ్చారు.ఆదివారం మండల కేంద్రంలో మున్సిపల్ కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ కార్మికులకు సమ్మెహక్కుకూడా లేకుండా చేశాడని, ఆదాని అంబానీలకు సర్వం ధారా దత్తం చేసి కార్మికులను బలి పశువులు చేశారన్నారు. ప్రస్తుతం కార్మిక వర్గం ఐక్యమై పోరాడితే తప్ప తమ హక్కులను కాపాడుకోలేమన్నారు. 11 గంటల పని దినాలు తెచ్చి కార్మికులపై పెను భారం వేశారన్నారు. ఎనిమిది గంటల పని దినంకై పోరాడిన చరిత్ర కార్మికులదని కార్మికుల హక్కులను కాలరాశి ఇలా కట్టు బానిసలు చేశారన్నారు. కార్మిక వర్గానికి పోరాటమే తప్ప మరో మార్గం లేదన్నారు.పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో టియుసిఐ నాయకులు ఓంకార్ రాజన్న బాలన్న గంగాధర్ మనోహర్ గంగ అక్క రాజమణి లక్ష్మి పోషవ్వ లతోపాటు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.