నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఈ నెల 12న దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఇతర ప్రజానీకం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శిర్ప హనుమాన్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పెన్షనర్లకు నష్టదాయకమైన వ్యాలిడేషన్ ఆఫ్ టెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని, సీనియర్ సిటిజెన్లకు రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, పెన్షనర్లకు ఇన్కమ్ టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది వేలు చెల్లించాలని, సొంత ఇల్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు సొంత ఇంటి కలను నెరవేర్చాలని, తదితర డిమాండ్ల సాధనకై ఈ సార్వత్రిక సమ్మెలో రిటైర్డ్ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ జిల్లా నాయకులు జార్జ్, లావు వీరయ్య, ప్రసాదరావు, పుష్పలీల, లలిత, చంద్రశేఖర్, నరేందర్, బాల దుర్గయ్య, రాజేశ్వర్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.