23న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయండి
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు అధ్యక్షులు మాధరి రాజన్న ఆధ్వర్యంలో నవంబర్ 23వ తేదీన హైదరాబాదులోని సరూర్నగర్ గ్రౌండ్లో జరిగే మాలల రణభేరి మహాసభ కరపత్రాలను పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చొక్కాం దేవదాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ హాజరై మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు చోక్కం దేవదాసు...