Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 6:23 pm Posted by : ramakrishna

20న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

మోపాల్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంధను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల వారు మాట్లాడారు.  కేంద్ర, ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో  తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతు ఉద్యమ ఫలితంగా వెనక్కు తీసుకొని  ఆరోజు రాతపూర్వకంగా  ఇచ్చిన హామీలను తుంగలోదొక్కి  తిరిగి దొంగచాటుగా  నూతన వ్యవసాయ మార్కెట్  విధానం పేరుతో  వ్యవసారంగాని  బజారు పాలు  చేసే చట్టాన్ని  తీసుకు వస్తున్నారని మండిపడ్డారు.  మోడీ సర్కార్ పెట్టుబడిదారులకు  ఊడిగం చేయడానికి  వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబానీలకు అప్పజెప్పడానికి కుట్ర. పన్ను తున్నారని ఆరోపించారు.  దీనివల్ల రైతులు  తమ భూముల  నుండి బేదాకలు  అయ్యే ప్రమాదం ఉందని  అన్నారు.  విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, దేశవ్యాప్తంగా  రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను రుణ విముక్తి చేయాలని, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. దేశంలోని కార్మిక వర్గం పోరాడి తెచ్చుకున్న చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక రంగాన్ని నిర్వీర్యం  చేస్తూ, ఎలాంటి హక్కులు  లేకుండా   చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కార్మిక వర్గం దేశవ్యాప్తంగా 20 తేదీన సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తుందని ఇప్పటికైనా మోడీ సర్కార్ ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హగ్గు ఎర్రన్న, ఎం.నారాయణ, గంగ మల్లు, చిన్నయ్య, దండు మల్లన్న, మహేష్ ,గాజుల గంగారం, దమ్మడి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.