సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
రుద్రూర్, బతుకమ్మ : జులై 9న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికలోకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టియుసిఐ రాష్ట్ర కమిటీ నాయకులు బి. మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ 600 నుండి 1000 లోపే వస్తుందని ఇది రాజీనామాలు చేసిన కార్మికులకు వారి వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదని...